Monday, August 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం 

ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం 

- Advertisement -

సెప్టెంబర్ 9 వరకు అడ్మిషన్లు: ప్రిన్సిపల్ పరంగి రవి 
నవతెలంగాణ-అచ్చంపేట
వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆగిపోయిన వారికీ ఓపెన్ డిగ్రీ ద్వారా చక్కటి అవకాశం కల్పిస్తుందని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పరంగి రవి తెలిపారు. సోమవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ..ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల వివరాలను వెల్లడించారు. దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ చదువుకోడానికి అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు ఉన్నత విద్య అర్హతలు లేకపోవడం వల్ల ప్రమోషన్స్ కు నోచుకోవడం లేదు. అలాంటివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2026 – 2027 విద్య సంవత్సరానికి సంబంధించి. డిగ్రీ లో బిఏ, బి కాం, బి ఎస్సి, కోర్సు లలో సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తులను తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. మొదటి సంవత్సరం  రూ.3200/- రెండవ సంవత్సరం  రూ.3000/-, మూడవ సంవత్సరం రూ.3000/- ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. సైన్స్ సబ్జెక్టు ఎంచుకున్న విద్యార్థులు ల్యాబ్ ఫీజు రూ.1600 /-, కంప్యూటర్ ఫీజు రూ.4,000/- ప్రతి ఏడాది చెల్లించవలసి ఉంటుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -