Monday, August 10, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
కుభీర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు నీట మునిగి మృతి చెందిన ఘటన కుభీర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సోఫియాన్‌ (10), గణేష్‌ (13) సోమవారం సరదాగా ఈతకోసం డోడర్నా చెరువులోకి దిగారు. ఇందులో ఒక బాలుడు ఒడ్డుపై ఉన్నాడు. అయితే ఈత కొడుతున్న క్రమంలో అకస్మాత్తుగా నీళ్ళల్లో మునిగి సోఫియాన్, గణేష్ మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానికులు బాలురను బయటకు తీశారు. ఈ ఘటనలో సోఫియాన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌ను చికిత్స కోసం బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల మృతితో కుభీర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -