Monday, August 10, 2026
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్ లో విద్యార్థులపై లాఠీచార్జ్..ఖండించిన రాహుల్ గాంధీ

జార్ఖండ్ లో విద్యార్థులపై లాఠీచార్జ్..ఖండించిన రాహుల్ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పోటీ పరీక్షల పేపర్ లీక్ లను వ్యతిరేకిస్తూ జార్ఖండ్ లో విద్యార్థులు ఆ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విధాన సభవైపు సాగుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సంఘటనపై తాజాగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. శాంతియుత నిరసన అనేది ఒక హక్కు అని, జార్ఖండ్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడాన్ని రాహుల్ గాంధీ సోమవారం ఖండించారు.

“జార్ఖండ్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం తప్పు. విద్యార్థులకు శాంతియుత నిరసన తెలిపే హక్కు ఉంది, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు లభిస్తాయి,” అని గాంధీ Xలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -