నవతెలంగాణ-హైదరాబాద్: 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాల వేళ మొట్టమొదటి సారి వందేమాతర గేయాన్ని ఎర్రకోటపై ఆలపించనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే సంబరాల్లో ఆ గేయాన్ని పాడనున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కూడా ఈ ప్రత్యేక గీతాలాపన చేపట్టనున్నారు. యువశక్తి ఫోకస్‌తో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను నిర్వహించనున్నారు. బంకించంద్ర ఛటర్జీ తొలుత 1875లో వందేమాతరం గేయాన్ని రచించారు. తర్వాత తన ఆనంద్‌మఠ్ నవలలో ఆ గేయాన్ని చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం వందేమాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది. ఇటీవలే పార్లమెంట్‌లో వందేమాతరం గేయంకు సంబంధించిన బిల్లును పాస్ చేశారు. ఆ చట్టం ప్రకారం.. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొన్నిసార్లు జరిమానా కూడా విధిస్తారు. వందేమాతరం రాసి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ బిల్లును, ఆ గేయానికి గౌరవ సూచకంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఆగస్టు 15న ఎర్రకోటపై వందేమాతరం గేయం ఆలాపన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



