Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశు వైద్య శిబిరంలో గర్భకోశ వ్యాధుల నిర్ధారణ చికిత్సలు

పశు వైద్య శిబిరంలో గర్భకోశ వ్యాధుల నిర్ధారణ చికిత్సలు

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని మోటాటిపల్లి గ్రామంలో సోమవారం పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో గర్భకోశ వ్యాధుల నిర్ధారణ చికిత్స పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ భూమయ్య పశు వైద్యాధికారి దేవేందర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రతి పశువుకు వేయించాలని, భారత్ పశుద ఆప్ లో నమోదు తప్పనిసరి చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో దాదాపు 22 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు, 47 పశువులకు గాలికుంటు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజిరెడ్డి, పశు వైద్య సిబ్బంది గోపాలమిత్ర కృష్ణ, సురేష్, భరత్, సందీప్, పాడి రైతులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -