Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమనసుల్ని కదలించే సినిమా

మనసుల్ని కదలించే సినిమా

- Advertisement -

అమిత్ రాయ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, రాజేష్ కుమార్, గీతా అగర్వాల్ శర్మ, పవన్ మల్హోత్రా, శ్రీధర్ దూబే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మై డాగ్’. రాజేష్ భరద్వాజ్, అమిత్ రాయ్, సనా వార్సీ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 7న విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవు తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందిస్తూ దర్శకుడు శశికిరణ్ తిక్క ముఖ్య అతిథిగా పాల్గొని విలేకరుల సమావేశం నిర్వహించారు.దర్శకుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ,‘నేను ఈ సినిమాను రాయలేదు. నిజానికి ఈ కథను నాతో డాగ్సే రాయించాయి. మన నిజాయితీని నిరూపిం చుకోవడానికి మనం ఎంత దూరమైనా వెళ్తాం. అదే విధంగా డాగ్స్ తమ ప్రేమను, నిజాయితీని నిరూపించుకోవడానికి ఎంత దూరం వెళ్తాయి. అదే ఈ కథకు మూలం.డాగ్స్ మనకు సహానుభూతిని, ప్రేమను, కరుణను ఎలా నేర్పిస్తాయనేది ఈ సినిమా ద్వారా చూపించాం. ఈ సినిమాను మీరు తప్పకుండా చూడండి. మీ పిల్లలకు కూడా చూపించండి. ఈ కథ మిమ్మల్ని కదిలిస్తుంది. మీలో ప్రేమను నింపుతుంది. తప్పకుండా మీకు ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది’ అని అన్నారు. దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ,‘ఇది ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. అమిత్ రాయ్ గతంలో తీసిన ‘ఓ మై గాడ్ 2’ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ‘ఓ మై డాగ్’ కూడా అందరూ తప్ప కుండా చూసి ఆనందించాల్సిన సినిమా. దేశం మొత్తం గర్వించాల్సిన సినిమా ఇది. అందరూ తప్పకుండా చూడండి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -