Wednesday, August 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజలాంతర్గామిని ధ్వంసం చేసే యుద్ధ నౌక

జలాంతర్గామిని ధ్వంసం చేసే యుద్ధ నౌక

- Advertisement -

నిర్మాణాన్ని ప్రారంభించిన వియత్నాం
హానోరు :
దేశీయ పరిజ్ఞానంతో జలాంతర్గాములను ధ్వంసం చేసే అతి పెద్ద, అత్యాధునిక యుద్ధ నౌక నిర్మాణాన్ని వియత్నాం ప్రారంభించింది. దనాంగ్‌ నగరంలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సాంగ్‌ థూ నౌకాశ్రయంలో దీనిని నిర్మిస్తున్నారు. దేశంలో అభివృద్ధి చేసిన ఆయుధాలు, సైనిక సామగ్రి కూడా ఈ నౌకాశ్రయంలోనే ఉంటాయని సైన్యానికి చెందిన వార్తా పత్రిక తెలియజేసింది. చైనా తదితర దేశాలతో వియత్నాంకు జల వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రక్షణ తయారీ సామర్ధ్యాలను పెంచుకోవాలని వియత్నాం భావిస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి సైనిక హార్డ్‌వేర్‌ దిగుమతులను తగ్గించుకోవాలని కూడా అనుకుంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -