Wednesday, August 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచిన్నారుల టీకాలలో కోత

చిన్నారుల టీకాలలో కోత

- Advertisement -


ఉత్తర్వుపై సంతకం చేసిన ట్రంప్‌
వాషింగ్టన్‌ :
చిన్నారులకు ఇచ్చే టీకాల సంఖ్యను కుదించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. గవదబిళ్లలు, తట్టు, రుబెల్లా వంటి వ్యాధులకు ఇచ్చే టీకాలను కూడా ఆయన విభజించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుపై ట్రంప్‌ సంతకం చేశారు. ఈ రోజు అవసరమైన టీకాలలో చాలా తక్కువ వాటిని మాత్రమే దశాబ్దాల క్రితం పిల్లలు తీసుకునే వారని ట్రంప్‌ చెప్పారు. ‘ఆ రోజులలో ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న అధిక ఆటిజం రేట్లు అప్పుడు లేవు’ అని అన్నారు. కాగా ట్రంప్‌ తాజా ఉత్తర్వుపై వైద్య నిపుణులు విమర్శలు కురిపించారు. టీకాల రేటు తగ్గితే చిన్నారులు హానికరమైన వ్యాధులకు గురవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ (ఏఏపీ) సిఫార్సు చేసిన 18 టీకాలను 11కు తగ్గించాలని ట్రంప్‌ తన ఉత్తర్వులో సిఫార్సు చేశారు. కాగా అమెరికాలో విద్యార్థులకు కావాల్సిన టీకాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర స్థాయిలో నిర్ణయిస్తారు కాబట్టి ట్రంప్‌ ఉత్తర్వు కేవలం ఓ మార్గదర్శకంగానే పనిచేస్తుంది. అది తప్పనిసరి ఆదేశం కాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -