భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు
డా. ఏనుగు నరసింహా రెడ్డి
హైదరాబాద్ కల్చరల్ ఫెస్ట్ గోడ పత్రిక ఆవిష్కరణ
నవతెలంగాణ-కల్చరల్
భిన్న సంస్కృతులు, మతాలకు హైదరాబాద్ నగరం కేంద్రంగా నిలుస్తోందని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 16న హైదరాబాద్ రవీంద్రభారతి ప్రధాన వేదికపై నిర్వహించనున్న ‘కల్చరల్ ఫెస్ట్-2026’ గోడపత్రికను రవీంద్రభారతిలోని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల కార్యాల యంలో మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలన కాలం నుంచి జంట నగరాల్లో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన తదితర మతాల ప్రజల మధ్య స్నేహభావం కొనసాగుతోందని తెలిపారు. హైదరాబాద్ సంస్కృతి, వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య మాట్లాడుతూ.. 2018 నుంచి ప్రతి సంవత్సరం కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్ర మంలో ప్రఖ్యాత కళాకారులు పేరడీ గురుస్వామి, రవూఫ్ స్టాండప్ కామెడీ, చొక్కాపు రమణ మ్యాజిక్, మౌనిక పెప్పటి షో, క్రాంతికార్, రామడుగు వసంత్ తదితరుల ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ‘ది ట్రయల్ ఆఫ్ భగత్‌సింగ్’, ‘సే నో టు డ్రగ్స్’, అవయవదానం వంటి సామాజిక అంశాలపై స్కిట్లు, నృత్యాలు, పాటలు ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్లం రమేష్, శ్రీనివాస్‌రావు, పి.నాగేశ్వరరావు, మోహన్ నాయుడు, గోపాల్, సంగీత, కె.లలిత, కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
భిన్న సంస్కృతుల కేంద్రం హైదరాబాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



