- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మంగళవారం విధులకు హాజరైన కానిస్టేబుల్ సాయి విధుల్లో ఉండగానే రాత్రి పీఎస్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టం కోసం అతని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



