Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడే అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం..

నేడే అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ ఏడాదిలో సంభవించే అత్యంత అరుదైన తొలి ‘సంపూర్ణ సూర్యగ్రహణం’ నేడు ఏర్పడనుంది. కాగా ఈ అమావాస్యను చుక్కల అమావాస్య కూడా అంటారు. ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం 55 దేశాల్లో ఏదో ఒక దశలో కనిపించనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇక్కడ రాత్రి ఉండటంతో ఈ సూర్యగ్రహణం మనదేశంలో కనపడదు. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారు జామున 3.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఈ గ్రహణంలో కేవలం స్పెయిన్, ఐస్‌లాండ్ దేశాల్లో మాత్రమే పూర్తిస్థాయి ‘సంపూర్ణ సూర్యగ్రహణం’ ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో అక్కడి ప్రాంతాల్లో సూర్యుడు పూర్తిగా చంద్రుని వెనుక దాగి చీకటి అలుముకుంటుంది. మిగిలిన 53 దేశాల్లో మాత్రం ఇది ‘పాక్షిక సూర్యగ్రహణం’గా మాత్రమే దర్శనమివ్వనుంది. భారత్‌లో కనిపించకపోయినప్పటికీ ఖగోళ ప్రేమికులు, శాస్త్రవేత్తలు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -