Wednesday, August 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబోటు బోల్తా..15 మంది మృతి, 27 మంది మిస్సింగ్‌

బోటు బోల్తా..15 మంది మృతి, 27 మంది మిస్సింగ్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : జింబాబ్వేలోని క‌రీబా స‌ర‌స్సులో బోటు బోల్తా ప‌డింది. ఆ ఘ‌ట‌న‌లో సుమారు 15 మంది మృతిచెంద‌గా, 27 మంది గాయ‌ప‌డ్డారు. ఓవ‌ర్‌లోడ్ వ‌ల్ల బోటు బోల్తా ప‌డిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. బోటు ప్ర‌మాదం నుంచి సుమారు 77 మందిని ర‌క్షించారు. స‌ర‌స్సు మ‌ధ్య‌లో బోటు మున‌క వేయ‌డంతో.. ప్ర‌యాణికుల‌ను ర‌క్షించేందుకు చిన్న బోట్లు రంగంలోకి దిగాయి. బోల్తా ప‌డిన బోటు వ‌ద్ద‌కు స్పీడ్‌బోట్లు చేరుకున్న వీడియోను రిలీజ్ చేశారు. భారీ బృందంతో రెస్క్యూ ఆప‌రేష‌న్స్ చేప‌ట్టారు. క‌రీబా స‌ర‌స్సు.. జింబాబ్వే, జాంబియా మ‌ధ్య ఉంటుంది. టికెట్ అమ్మ‌కాల ద్వారా బోటులో సుమారు 114 మంది ప్ర‌యాణికులు ఉండి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. అయిదు మంది సిబ్బంది ఉన్నారు. చిన్న‌పిల్ల‌ల‌కు టికెట్ ఉండ‌దు కాబ‌ట్టి, మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. బోటు సామ‌ర్థ్యం 90 మంది కాగా, ఓవ‌ర్‌లోడ్‌తో వెళ్తున్న‌ట్లు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -