Wednesday, August 12, 2026
E-PAPER
Homeక్రైమ్నల్గగొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..

నల్గగొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జేబీ కాలనీలో నివాసముంటున్న రూపారెడ్డి (45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

రూపారెడ్డి కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నది. ఆమె భర్త హైదరాబాద్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భర్త ఫోన్‌ చేయగా రూపారెడ్డి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో అనుమానం వచ్చింది. దీంతో అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి సమాచారం అందించారు.

వారు ఇంటికి వెళ్లి చూడగా రూపారెడ్డి హత్యకు గురై కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -