- Advertisement -
•తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ 93.4 శాతం పూర్తయిందని తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.మండలంలో మొత్తం 30,503మంది ఓటర్లు ఉండగా,అందులో 28,489మందికి (93.4 శాతం) ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తయి నట్లు వివరించారు.ఈ ప్రక్రియలో భాగంగా143 మంది మరణించిన ఓటర్లు,1712 మంది వేరే ప్రాంతాలకు తరలిపోయినవారు,125మంది డబుల్ ఓటర్లు,34 మంది అందుబాటులో లేనివారుగా గుర్తించామని,2014 ఫారాలు తొలగించాల్సినవి లేదా సవరించాల్సినవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ఓటర్ల జాబితాను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని,అర్హులందరికీ అవకాశం కల్పిస్తామని తెలిపారు.
- Advertisement -



