Thursday, August 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగర్భిణీకి వరద కష్టాలు

గర్భిణీకి వరద కష్టాలు

- Advertisement -

డోలిలో వాగు దాటించిన స్థానికులు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌

​ప్రపంచమంతా ఆధునిక రంగం వైపు ఉరుకులు పరుగులు పెడుతుంటే ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం ప్రజలు మౌలిక వసతుల కల్పన కోసం అల్లాడుతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాలకు సరైన దారులు లేక గర్భిణులు, రోగులు తీవ్ర అవస్థ పడుతున్నారు. భూమ్మీదకు మరో ప్రాణాన్ని తీసుకొస్తున్న గర్భిణులు ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వస్తోంది.
కుమురంభీం- ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం దేవాపూర్‌-కొలంగూడకు చెందిన కొడప భీంరావు భార్య రామేశ్వరి ఏడు నెలలు గర్భిణి. బుధవారం కడుపులో నొప్పి ప్రారంభం కావడంతో మండల కేంద్రానికి తీసుకురావాల్సి వచ్చింది. వర్షం పడటంతో మండల కేంద్రానికి గ్రామానికి మధ్యలో ఉన్న వాగు పొంగి ప్రవహిస్తుండగా అంబులెన్స్‌ కూడా వచ్చే పరిస్థితి లేకపోయింది. దాంతో స్థానికులు డోలి తయారు చేసి దాంట్లో ఆమెను వాగు దాటించారు. గర్భిణిని వాగు దాటించడానికి ఈతగాళ్లు కూడా కష్టపడాల్సిన వచ్చింది. మండల కేంద్రానికి చేరుకునేసరికి ఆమె పరిస్థితి కొంత విషమంగా మారడంతో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా పీవీటీజీ గ్రామాలకు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -