Thursday, August 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజీఆర్‌ఎంబీ ఎజెండాను ఉపసంహరించుకోవాలి

జీఆర్‌ఎంబీ ఎజెండాను ఉపసంహరించుకోవాలి

- Advertisement -

18న ఆ కార్యాలయం ముట్టడి : మాజీమంత్రి హరీశ్‌‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం రేవంత్‌ ‌రెడ్డిని… బీఆర్‌ఎస్‌ ‌నిలదీస్తే తప్ప సోయి రాదా? అని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం జీఆర్‌ఎంబీ ఎజెండాలో అంశాలను చేర్చిచే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. ఎజెండాను ఉపసంహరించుకోకుండా ఈనెల 18న హైదరాబాద్‌‌లో సమావేశాన్ని నిర్వహిస్తే జీఆర్‌ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై హరీశ్‌‌రావు ఎక్స్‌ ‌వేదికగా స్పందించారు. తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ఏపీ ప్రతిపాదిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. జీఆర్‌ఎంబీని ఎందుకు నిలదీయలేదనీ, ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని తెలిపారు. లేఖలతో పనులు కావనీ, తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం జీఆర్‌ఎంబీ ఎజెండాలో పెట్టిన అంశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అవి ఎజెండా నుంచి తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలని కోరారు. అవసరమైతే ఆ అంశాలు వెనక్కి తీసుకోకపోతే జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరు కాబోమని కరాఖండిగా తేల్చి చెప్పాలని సూచించారు. రాజకీయ అవసరాల కోసం సమావేశానికి వెళ్లి అక్కడ తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పెట్టిన అభ్యంతరాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కేంద్రం చేతిలో ఉన్న జీఆర్‌ఎంబీని చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జల ద్రోహాన్ని అడ్డుకుంటామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -