Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅంత్యక్రియలకు హాజరై.. చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

అంత్యక్రియలకు హాజరై.. చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన గణేష్ (30), మునిరాజు (58) చెరువులో స్నానానికి వెళ్లి మృతి చెందారు. గణేష్‌కు ఒక్కసారిగా మూర్ఛ రావడంతో నీటిలో పడిపోగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన మునిరాజు కూడా మునిగిపోయాడు. ఇద్దరూ చాలాసేపు బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందడంతో స్థానికులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. అంత్యక్రియలకు హాజరైన కుటుంబాల్లో ఈ ఘటన మరో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -