Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల అభివృద్ధికి సీఎం స్పష్టమైన హామీలు ఇవ్వాలి

పరకాల అభివృద్ధికి సీఎం స్పష్టమైన హామీలు ఇవ్వాలి

- Advertisement -

వ్యవసాయ మార్కెట్‌లో కోల్డ్‌స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలి
ఆయిల్‌ఫామ్‌ రైతులకు అనుకూలంగా ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నక్క చిరంజీవి
నవతెలంగాణ–పరకాల

ఈనెల 16న ముఖ్యమంత్రి పరకాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన పరకాల అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన హామీలు ఇవ్వాలని మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నక్క చిరంజీవి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పరకాల వ్యవసాయ మార్కెట్‌లో రైతుల ప్రయోజనాల కోసం కోల్డ్‌స్టోరేజ్‌ నిర్మించాలని కోరారు. పరకాల ప్రాంతంలో ఆయిల్‌ఫామ్‌ సాగు విస్తరిస్తున్నందున రైతులకు ప్రయోజనం చేకూరేలా ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పరకాలలో పండ్ల మార్కెట్‌, చేపల మార్కెట్‌లను ఏర్పాటు చేసి రైతులు, వ్యాపారులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలని చిరంజీవి కోరారు. ప్రతిపాదిత పరిశ్రమల ఏర్పాటుతో వెనుకబడిన పరకాల ప్రాంత అభివృద్ధికి దోహదపడటంతోపాటు వ్యవసాయ రంగం బలోపేతమై రైతులు, కార్మికులు, మహిళలు, యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, పరకాల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీలు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -