Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బైకు దొంగ అరెస్టు 

బైకు దొంగ అరెస్టు 

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకు దొంగతనాలు చేసిన బైకు దొంగను అరెస్టు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న బైక్ దొంగతనం కేసుకు సంబంధించి టౌన్–I పోలీసులు ప్రత్యేక పహారా, గట్టి పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. దర్యాప్తును వేగవంతం చేసి ఒక దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 05 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు మరియు ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు. అరెస్ట్ చేసిన నిందితుడి వివరాలు జగావ్ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ కు చెందిన కర్నెకంటి కిరణ్ ను  అరెస్ట్ అనంతరం నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు అతనిని న్యాయ పరిరక్షణ (జుడీషియల్ కస్టడీ) కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టేందుకు నగరంలో పహారా, పర్యవేక్షణ ప్రత్యేక దర్యాప్తు చర్యలను మరింత బలోపేతం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అలాగే, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -