ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి

– సర్పంచ్ బాతరాజు సత్యం
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
చౌటుప్పల్ మండలం పంతంగి కొయ్యలగూడెం గ్రామాలలో అభయ హస్తం ప్రజా పాలన ద్వారా ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల దరఖాస్తులను బుధవారం స్వీకరించారు. పంతంగి గ్రామంలో సర్పంచ్ బాతరాజు సత్యం కొయ్యలగూడెంలో మండల పరిషత అభివృద్ధి అధికారి సందీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చౌటుప్పల్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఉప్పు భద్రయ్య కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయే ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బోయ ఇందిర జెల్లా ఈశ్వరమ్మవెంకటేశం ఉప సర్పంచ్ బోయ లింగస్వామి తహసిల్దార్ హరికృష్ణ, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు ఏఈ సత్యనారాయణ ఆర్ఐ సుధాకర్ రావు ఎస్సై యాదగిరి పంచాయతీ కార్యదర్శి చింతల శ్రీకాంత్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love