- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు రోజు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు వచ్చాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమై, హైకోర్టు ఆవరణ, విమానాశ్రయ ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఈ బెదిరింపుల నేపథ్యంలో సున్నితమైన ప్రభుత్వ భవనాలు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల వద్ద నిఘాను మరింత పెంచారు. అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో తనిఖీలను తీవ్రతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
- Advertisement -



