Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జన్మదిన వేడుకలకు శుక్రవారం మండలంలోని 30 గ్రామ పంచాయతీల పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు, కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు, భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ అధ్యక్షుడు బొల్లిగంగాధర్, డోన్ గావ్ సర్పంచ్ శ్రీనివాస్, మాదాపూర్ సర్పంచ్ ఆశా పటేల్, కౌలాస్ సర్పంచ్ ఎంబరీ విద్య, పడంపల్లి ఉపసర్పంచ్ నాధుడే సవిత, జుక్కల్ మాజీ ఉపసర్పంచ్ భాను గౌడ్, గుండూరు సర్పంచ్ కాశీనాథ్, మహమదాబాద్ మాజీ ఎంపిటిసి భర్త  గంగాధర్ , కేమ్రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ సుంకరి వెంకటి, ఖండేబెల్లుర్ మాజీ సర్పంచ్ శివరాజ్ దేశాయ్, అదేవిధంగా మండలంలోని సోపూర్, బస్వాపూర్ మాజీ సర్పంచ్ రవి పటేల్, లొంగన్ సర్పంచ్ సదు పటేల్, ఆధ్వర్యంలో భారీ జన సమీకరణతో వెళ్లారు. అంతకుముందు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జుక్కల్ చౌరస్తా వద్ద భారీగా స్వాగతాలు పలికారు. అనంతరం మద్నూర్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హల్లో నిర్వహించారు. ఈ పుట్టినరోజు కార్యక్రమానికి నియోజకవర్గస్థాయి నుండి 8 మండలాల నుండి భారీ జన సమీకరణ ద్వారా రావడంతో రోడ్లన్నీ గులాబీ జెండాతో గులాబీ మయంగా మారింది. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయంగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -