Friday, August 14, 2026
E-PAPER
Homeఖమ్మంకనీస వేతన జీవోలను అమలు చేయాలి

కనీస వేతన జీవోలను అమలు చేయాలి

- Advertisement -

– ఈ నెల 20న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట టీయూసీఐ ధర్నా
నవతెలంగాణ – సత్తుపల్లి

శ్రామిక వర్గానికి చట్టబద్ధమైన కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బానిసలుగా పనిచేయించుకుంటున్నాయని టీయూసీఐ నాయకులు మండిపడ్డారు. గురువారం సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. రామయ్య, టీయూసీఐ జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్ మాట్లాడారు. కనీస వేతనం అనేది కార్మికుల భిక్ష కాదని, గౌరవంగా జీవించే హక్కు అని స్పష్టం చేశారు. మూడూ యూనిట్ల ప్రామాణికత ఆధారంగా, పెరిగిన ధరలకు అనుగుణంగా శాస్త్రీయంగా వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు యజమానులకే కొమ్ముకాస్తూ శ్రామికుల శ్రమను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కనీస వేతనాల సాధనకై ఈ నెల 20న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా కార్మికులను చైతన్యపరుస్తూ గ్రూప్ మీటింగ్‌లు, కరపత్రాల పంపిణీ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవి, రమేష్, యేసోబు, సీతారాములు, కాంతమ్మ, యశోధ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -