అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
నవతెలంగాణ – మల్హర్ రావు
విత్తనాలు, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి బి.శ్రీజ డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం మండలం కొయ్యూరు రైతు వేదికలో విత్తనాల,ఎరువులు మరియు పురుగుమందుల డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏవో మాట్లాడారు. బోనస్ వర్తించాలి అంటే రైతులు తీసుకున్న వరి రకాలను రైతుల నుండి డీటెయిల్స్ తీసుకొని ఆన్లైన్ చేయాలని సూచించారు.అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో 20వ తేదీ నుండి FFS ఏప్ఏప్ ఎస్ (Framework For fertilizer sales) అనే సెంట్రల్ ఫెర్టిలైజర్ బుకింగ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇక అన్ని విధాలైన ఎరువులు ఆఅప్ ద్వారానే విక్రయాలు జరుగుతాయని తెలిపారు.అదేవిధంగా డీలర్స్ తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు సూచించారు.
లైసెన్స్ ను అందరికీ కనిపించేలా దుకాణంలో ప్రదర్శించాలని, స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్స్ వ్యవసాయ అధికారితో సర్టిఫై చేయించాలని, లైసెన్స్ లో పేర్కొన్న గోదాంలోనే సరకు నిల్వ చెయ్యాలని, ఎరువులు, విత్తనాలు లూజ్ గా అమ్మరాదని, పాకెట్ రూపంలో విక్రయించాలని, తెలంగాణ ప్రభుత్వం సూచించిన 7 రకాలు వరి విత్తనాలు కొన్న రైతుల వివరాలు వెంటనే ఆన్లైన్ చెయ్యాలని, రైతులకు ఈ-పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలని డీలర్లకు సూచించారు. విత్తనాలు, ఎరువులను ఎమ్మార్పీకే అమ్మాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు రసీదు లేకుండా విక్రయాలు చేపట్టవద్దని సీడ్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ డీలర్లకు సూచించారు. ప్రతి డీలర్ రైతులకు ఆధార్కార్డు ఆధారిత వేలి ముద్ర ద్వారా ఈ-పోస్ మెషిన్తో మాత్రమే ఎరువులను విక్రయించాలన్నారు. అవసరమైన ఎరువులను నిల్వ ఉంచుకోవలాన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిని అనూష,మండల డీలర్లు పాల్గొన్నారు.



