Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

మహిళల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

- Advertisement -

• ఏపీఎం ఎండీ మహబూబ్ పాషా 
నవతెలంగాణ -పెద్దవంగర
 
మహిళా సంఘాల బలోపేతం, సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఏపీఎం ఎండీ మహబూబ్ పాషా, పెద్దవంగర సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో శ్రీతులసి మండల సమాఖ్య (ఎంఎస్‌) 10వ వార్షిక మహాసభను ఎంఎస్‌ అధ్యక్షురాలు జి.భద్రమ్మ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక ఆడిట్‌ నివేదికను సభ్యులకు చదివి వినిపించారు.

సెర్ప్‌కు సంబంధించిన వివిధ అంశాలపై ప్రగతి నివేదికను సమర్పించడం తో పాటుగా, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ.. సంఘాల ద్వారా మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అనంతరం ఎంఎస్‌ నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంఎస్‌ కార్యదర్శి అనూష, కోశాధికారి సునీత, శ్రీనిధి మేనేజర్‌ సంధ్య, సీసీలు సుజాత, ఉమారాణి, సుధాకర్‌, వీవోఏ సంఘం అధ్యక్షురాలు సంధ్య, ఆపరేటర్‌ అనిల్‌, ఎంఎస్‌ఏ ఆశాలత తో పాటు వివిధ గ్రామాల వీవో అధ్యక్షులు, వీవోఏలు, మెంటర్లు, బీడీఎస్‌పీలు, వీవోల కార్యదర్శులు, కోశాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -