Friday, August 14, 2026
E-PAPER
Homeఖమ్మంగిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల పోస్ట్‌కార్డ్ ఉద్యమం

గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల పోస్ట్‌కార్డ్ ఉద్యమం

- Advertisement -

నవతెలంగాణ – దమ్మపేట
గిరిజన సంక్షేమ శాఖలోని ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్. రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అంకంపాలెం, పార్కెల గండి, డి.గొల్లగూడెం, చీపురుగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డులు పంపి నిరసన తెలిపారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గురుకులాలపై చూపుతున్న శ్రద్ధను ఆశ్రమ పాఠశాలలపై చూపడం లేదని వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖలోని 300-400 పోస్టులను విస్మరించడం సరికాదన్నారు. వెంటనే ఆ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ​అలాగే ట్రైబల్ ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డీఈఓ పోస్టులను మంజూరు చేసి పదోన్నతులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలకు గ్రాంట్లు మంజూరు చేయడంతో పాటు కంప్యూటర్ ఫ్యాకల్టీ, ఏఎన్ఎం, స్కావెంజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సీఆర్టీలకు బేసిక్ పే చెల్లించి, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, దమ్మపేట మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -