- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవతెలంగాణ-హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని, వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశమిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పునస్కరించుకొని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi M) జాతినుద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మనం గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.
తెల్లారితే ఎనభయో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో యవాత్ భారతావని పులకించనుంది. న్యాయ వ్యవస్థను, చట్టసభలను మనం గౌరవించాలని ప్రజలకు సందేశమిచ్చారు. తాజాగా లోక్సభ్లో మొట్టమొదటిసారిగా ఆలపించిన వందేమాతరం గీతాన్ని పౌరులంతా గౌరవించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి కోరారు.
మనదేశంలోని విద్యార్థులు, టీచర్లు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అభివృద్ధి కోసం ఆతృతగా ఉన్నారు. అలానే వైద్యులు, వైద్యరంగంలోని సిబ్బంది ఆరోగ్య రంగంలో కృషి చేస్తున్నారు. రైతులు పంటలు పండించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగమవుతున్నారు. మిగతా రంగాల్లోని వారు సైతం రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తున్నారు. వారందరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఘనమైన వారసత్వ సంపద, స్వాతంత్య్ర పోరాటంలోని ఆశయాలనుంచి మనం ఆధునిక యుగంలో అడుగుపెట్టాం.‘ గత దశాబ్దంలో మన దేశం ఎంతో వేగంగా సమ్మిళిత వృద్ధిని సాధించింది. వారసత్వం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ దశాబ్దాల నాటి అడ్డంకులను తొలగించాం’అని రాష్ట్రపతి ముర్ము జాతినుద్దేశించి చేసిన సుదీర్ఘ ప్రసంగంలో వెల్లడించారు.



