వరల్డ్ ఆర్చరీ కేఏఏ యూత్ ఇన్విటేషనల్–2026
నవతెలంగాణ ఇంచియాన్: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ కేఏఏ యూత్ ఇన్విటేషనల్–2026లో భారత రికర్వ్ బాలికల జట్టు స్వర్ణ పతకం సాధించింది. కొండపావులూరి యుక్తశ్రీ, కృషి కుమావత్, ప్రాజల్ తొలియాలతో కూడిన భారత జట్టు ఫైనల్లో ఆతిథ్య దక్షిణ కొరియాను 5–3 తేడాతో ఓడించింది. ఆగస్టు 10 నుంచి 14 వరకు జరిగిన ఈ పోటీల్లో భారత జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ విజయంపై యుక్తశ్రీతో పాటు జట్టు సభ్యులను శాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షురాలు నందమూరి తేజస్విని, చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బి.వి. రమణ అభినందించారు. దేశ సీనియర్ విభాగంలో టాప్–8 ప్రాబబుల్స్‌లో కొనసాగుతున్న యుక్తశ్రీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.



