నవతెలంగాణ – జుక్కల్ : మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతి కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కర్రేవార్ సావిత్రి సాయగౌడ్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను శనివారం నాడు ఎగురవేయడం జరిగిందని జీపీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయా గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సావిత్రి సాయా గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రం సుమారు యోధుల పోరాటం చేసి సాధించుకున్న ఇండీయా ఎంతో అభివృద్ధి పనులను చేయడం జరిగిందని అన్నారు . దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేసే వారున్నారు అని పల్లె గ్రామీణులు, రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, కర్షకులు, అందరు ఆర్థీకంగా బలం పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఎగురవేసిన సర్పంచ్ సావిత్రి సాయా గౌడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



