Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధికి బాటలు: వార్డు కౌన్సిలర్ నర్మే నవీన్

అభివృద్ధికి బాటలు: వార్డు కౌన్సిలర్ నర్మే నవీన్

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్ : బడుగు, బలహీన వర్గాల పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని పట్టణంలోని 34వ వార్డు కౌన్సిలర్ నర్మే నవీన్ శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్, పాలకవర్గం కృషితో, సంబంధిత అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులకు నిర్విరామ కృషి చేస్తున్నామని అన్నారు. పట్టణంలోని దయానంద్ నగర్ కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని.ఎనిమిది లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభిస్తామని, వచ్చే అక్టోబర్ నెల వరకు కాలనీ మొత్తం బిటి రోడ్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గతంలో సిసి రోడ్లకు 15 లక్షలు, డ్రైనేజీ కి ఐదు లక్షలతో పనులుచేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -