Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ పరిధిలోగల రామరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 80వ  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ మూడు రంగుల మువ్వేన్నల జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడారు స్వాతంత్ర దినోత్సవం బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి, పొందినటువంటి రోజని, ఎందరో మహానుభావుల పోరాట త్యాగ ఫలితమే జెండా పండగన్నారు.స్వేచ్ఛాయుతంగా  ఉన్నామని తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలతో ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు సత్ప్రవర్తన,క్రమశిక్షణతో చక్కగా చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని, విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -