- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని మథుర తాండా సర్పంచ్ అనితా మోహన్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దలకు, యువకులకు ఆహ్వానం మేరకు బాధ్యతగా వేడుకలకు హాజరయ్యారు అని జీపీ కార్యదర్శి స్రావంతి తెలిపారు. అంతకు ముందు గ్రామంలో జాతి పిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ నాయకులు త్యాగాల ఫలితమే దేశం ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి పొందినామిని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత మోహన్ చౌహన్, ఉప సర్పంచ్, జీపీ కార్యదర్శి స్రావంతీ, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



