మండలంలోని నర్సాయగూడెం కు చెందిన ఎడవెల్లి కావ్య అనారోగ్యానికి గురి కావడంతో వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముందస్తుగా ముఖ్యమంత్రి సహాయ నిది నుండి మంజూరైన 1 లక్ష రూపాయల ఎల్ ఓ సి చెక్కును స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్, ఎంపిటిసి పసల జ్యోతి, తుమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.