- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రజలకు మరింత చేరువగా పరిపాలనను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేటి(ఆగస్ట్ 17) నుంచి మండలస్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 620 మండలాల్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు అర్జీలు స్వీకరించనున్నారు. అర్జీదారులకు నమోదుతో పాటు రిజిస్ట్రేషన్ నంబరు అందజేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో మండలస్థాయి నుంచే 70 శాతం ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
- Advertisement -



