- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రావణ మాసం మూడో సోమవారం కావడంతో అశోక్ ధామ్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
- Advertisement -



