- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం హనుమాన్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త వెంకటేశం(61)ను భార్య రాజమణి రోకలిబండతో కొట్టి చంపింది. ఆసిఫాబాద్ కమర్షియల్ టాక్స్‌ఆఫీసర్‌గా వెంకటేశం పనిచేస్తుండగా, హుస్నాబాద్‌లో ఏఎన్ఎంగా రాజమణి పనిచేస్తున్నారు. ఈ నెలలో వెంకటేశం పదవీవిరమణ కావాల్సి ఉండగా, రిటైర్‌మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన గొడవలో భర్తను రోకలిబండతో కొట్టి భార్య హతమార్చింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



