Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో SIR ముసాయిదా విడుదల

తెలంగాణలో SIR ముసాయిదా విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో SIR ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో సీఈవో సుదర్శన్‌రెడ్డి వివరాలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు తెలిపారు. 2.73 శాతం మంది చనిపోయినవారిగా గుర్తించినట్లు సీఈవో వెల్లడించారు. మరోవైపు సుమారు 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 32 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

ఓటు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నవారు తమ అభ్యంతరాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు, సంబంధిత దరఖాస్తులను పరిశీలించనున్నట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. SIR ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా అధికారులు పాల్గొంటారని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -