నవతెలంగాణ-హైదరాబాద్: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్కు భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆటలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 178 పరుగుల ఆధిక్యం సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో సొనాల్ దినుష (100) టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేయగా, నిరోషన్ డిక్వెల్లా 80 పరుగులతో రాణించారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 146 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ సాధించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (167) శతకంతో రాణించగా, కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు, కేశారా నువంతా మూడు, అసిత ఫెర్నాండో రెండు వికెట్లు పడగొట్టారు. రెండో రోజు వర్షం కారణంగా ఆటకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, మూడో రోజు ఎండ కాయడంతో పూర్తిస్థాయి ఆట సాధ్యమైంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డారు.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్..284 పరుగులకు ఆలౌట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



