కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం..

– ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ పరిశీలించిన మాజీమంత్రి దామోదర్ రెడ్డి
నవతెలంగాణ – చివ్వేంల : కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయంజరుగుతుందని మాజీమంత్రి దామోదర్ రెడ్డిఅన్నారు.శుక్రవారం తహసీల్దార్ టీం ఆధ్వర్యంలో లో మున్యా నాయక్ తండ, చివ్వేంల, ఎంపీడీఓ టీం ఆధ్వర్యంలో లక్ష్మీ నాయక్ తండ,  పులి తండాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మున్యా నాయక్ తండలోని ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి దామోదర్ రెడ్డి  పాల్గొని దరఖాస్తులను పరిశీలించి  అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వం అందించే ఆరు గ్యారెంటీ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో చెప్పిన మాట ప్రకారం  ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని అన్నారు.పలు కార్యక్రమాలలో జడ్పీ సీఈఓ సురేష్, స్పెషల్ ఆఫీసర్లు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాసరావు, తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మి,  మండల వ్యవసాయ అధికారి ఆశకుమారి, ఎం పి ఓ గోపి,వెటర్నరీ డాక్టర్ సంతోష్, మల్లయ్య, డిప్యూటీతహసీల్దార్ ఝాన్సీ, సర్పంచులు  బికారి, జూలకంటి సుధాకర్ రెడ్డి,సుజాత వెంకన్న, ఎంపీటీసీ సుశీల సాగర్, కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర నాయకులు కోప్పుల వేణరెడ్డి,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  వీరన్న నాయక్, చింతమల్ల రమేష్,వెన్న మధుకర్ రెడ్డి,నంద్యాల నరేష్ రెడ్డి,నాగు నాయక్,రాములు నాయక్, అంబి, భగవాన్ సింగ్, రవి, శ్రీను, కోటి, రాజు, వీరు, సింగ్, నీలా భాయ్,గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు,  వివిధ శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు..
Spread the love