- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం ఆయన బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారు. ఈ పర్యటనలో ఇరు దేశాల పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నారు. ఈ పర్యటన 11 రోజులపాటు సాగనుంది.
- Advertisement -



