Tuesday, August 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభర్తను హత్య చేసిన భార్య..!

భర్తను హత్య చేసిన భార్య..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51), భార్య సునీత (44) మధ్య ఆగస్టు 6న గొడవ జరిగింది. ఈ క్రమంలో సునీత తన భర్త చేతులు, కాళ్లను చీరతో కట్టి సెంట్రింగ్‌ కర్రతో తీవ్రంగా కొట్టింది. అనంతరం వాహనం నుంచి జారిపడి గాయపడ్డాడని కుమారుడికి చెప్పింది. ఆసుపత్రికి తరలించగా సత్యనారాయణ మృతి చెందాడు. ప్రమాదంపై అనుమానం వచ్చిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి భార్యను విచారించగా అసలు నిజం బయటపడింది.  .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -