- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ట్రాలీ వాహనం, ట్రక్కును ఢీకొట్టడంతో ఎనిమిది మంది కూలీలు మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. గ్వాలియర్‌లో వరినాట్లు వేసే పని పూర్తి చేసుకుని, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలోని గ్రామానికి తిరిగివెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న పశువులను తప్పించబోయి ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కును ఢీకొట్టడంతో కూలీలు అందులోనే చిక్కుకుపోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ముగ్గురు మృతి చెందారు.
- Advertisement -



