నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో గురువారం హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న టన్నెల్లోకి ఒక్కసారిగా భారీగా వర్షం నీరు చేరడంతో శిథిలాలు కూప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఘటన సమయంలో ప్రాజెక్టు ప్రాంతంలో 22 మంది పనిచేస్తుండగా, 14 మంది గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న కార్మికుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
తాజాగా టెన్నెల్ లో మంగళవారం సహాయక చర్యలు, గాలింపు చర్యలు ముగిశాయి. ప్రమాద సమయంలో గల్లంతు అయిన ఇద్దరి కార్మికుల ఆచూకీ లభ్యమైందని విపత్తు దళాల ఇంచార్జీ కరన్ సింగ్ తెలియజేశారు. దీంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు మంగళవారం ఆయన మీడియాకు తెలియజేశారు. ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరిందన్నారు. ఈ ఘటనలో 12 మంది కార్మికులు గాయపడగా, వారిలో ఇద్దరు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలియజేశారు.



