Tuesday, August 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే..తొలి రోజే అయోమయం

కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే..తొలి రోజే అయోమయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నేటీ నుంచి హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే రాకపోకలకు పోలీసులు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. త్వరలో చేపట్టబోయే పలు నిర్మాణాల కారణంగా ఆయా మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తాజాగా తొలి రోజు కావడంతో పలువురు వాహనాదారులు అయోమయానికి గురైయ్యారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ తో పాటు, గమ్యస్థానాలకు చేరాలంటే వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కేబీఆర్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడు రోజుల్లో ఇబ్బందులన్నీ తొలగిస్తామని… ప్రజలు తమకు సహకరించాలని కోరారు. పీక్ ఆవర్ లో సమస్యలు గుర్తించామని.. 500పైగా సిబ్బంది రోడ్ పై ఉండి మానిటరింగ్ చేశారని, డ్రోన్ ద్వారా పరిస్థితిని అంచనా వేశామని త్వరలోనే అన్ని సమస్యలకు చెక్ పెడుతామని, వాహనాదారులు సహకరించాలని సీపీ తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -