- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
యువత మత్తు పదార్థాలను దూరంగా ఉండాలని నాంపల్లి సీఐ దూది రాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్”కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు,విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి.రాంబాబు, సిబ్బంది ప్రశాంత్, అనిల్ పాల్గొన్నారు.
- Advertisement -



