Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
బీర్ల ఫౌండేషన్, ధీన శరణ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కెరీయర్ గైడెన్స్, మెరిట్ అవార్డ్స్ ప్రతిభా పురస్కారాలు ఆలేరు పట్టణంలో మంగళవారం మైనార్టీ హైస్కూల్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐడిఏఎస్ రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కోసo సమయం వృధా చేయకుండా క్రమశిక్షణ, పట్టుదలతో ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. నేడు యువతకు సంకల్పబలం, ఆర్థిక బలం, విజ్ఞాన బలం  ఉండాలని సూచించారు. అదేవిధంగా డాక్టర్ సౌజన్య మమత నర్సింగ్ హోమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష‍్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించాలని చెప్పారు. దినచర్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతల సాయిబాబా సభా అధ్యక్షత నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో డాక్టర్ పోరెడ్డి రంగయ్య  స్కూల్ అసిస్టెంట్ మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ ఐ కవిత, పి ఈ టి ఆరె విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -