Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆస్పత్రిగా మార్చాలి

తాడిచెర్ల ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆస్పత్రిగా మార్చాలి

- Advertisement -

కలెక్టర్ రాహుల్ శర్మకు సర్పంచ్ స్వామి వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మార్చాలని తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్  శర్మకు వినపత్రం అందజేశారు. కలెక్టర్ మంగళవారం మండలంలో పర్యటనలో భాగంగా ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ నిర్వహించిన నేపథ్యంలో సర్పంచ్ విన్నవించారు. మండల కేంద్రంలో ఆసుపత్రిలో 24 గంటల వైద్యం లేకపోవడంతో రాత్రిoభవళ్లు పాము కాటుతో ఇప్పటికే ఇద్దరు మృతిచెందారని తెలిపారు. మండల కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తే చుట్టుపక్కల గ్రామాలకు సైతం వైద్యం అందుబాటులో ఉంటుందని విన్నవించారు. ఆరోగ్య కేంద్రం ప్రక్కన సబ్ సెంటర్ భవనం, వైద్యాధికారి అతిధి గృహం అసంపూర్తిగా ఉన్నాయని, నిర్మాణాలు పూర్తియ్యేలా నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ కలెక్టర్ ను కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -