- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు ఢిల్లీలో ఐఎన్ సీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు హాజరుకానున్నారు. వీరితోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకుకూడా ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. దేశంలో విద్యార్థుల ఆందోళన మీద కేంద్రంపై ఒత్తిడికి వ్యూహం, రామ మందిర విరాళాల అంశంపై కార్యాచరణ, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై ఈ సీడబ్ల్యూసీలో సమీక్షించనున్నారు.
- Advertisement -



