నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖ క్యాన్సర్‌ను నిరోధించే హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ కస్తూరి సతీష్ కుమార్ సమక్షంలో సర్పంచ్ నాగుల మానస ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 నుండి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు ఈ టీకాను తీసుకుని గర్భాశయ ముఖ క్యాన్సర్ నుంచి రక్షణ పొందాలని సూచించారు.
మండలంలోని అర్హత గల బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం మొదటి రోజు నలుగురు బాలికలకు హెచ్‌పీవీ టీకా అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ ఇల్లేందుల శ్రీనివాస్, నర్సులు మౌనిక, సుమలత, ఫార్మసీ ఫార్మసిస్ట్ దీపిక, ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి, ఏఎన్‌ఎం భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సాయి, స్థానిక నాయకులు సాయిరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



