Sunday, April 5, 2026
E-PAPER
Homeసినిమా'బైకర్‌'..

‘బైకర్‌’..

- Advertisement -

బంపర్‌ బ్లాక్‌బస్టర్‌
హీరో శర్వానంద్‌ నటించిన తాజా చిత్రం ‘బైకర్‌’. మాళవిక నాయర్‌ హీరో యిన్‌గా నటించిన ఈ చిత్రంలో రాజ శేఖర్‌ పవర్‌ ఫుల్‌ పాత్రని పోషించారు.
అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్‌ మోటో క్రాస్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రీమియర్స్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈనెల 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌తో బంపర్‌ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ బంపర్‌ బ్లాక్‌బస్టర్‌ మీట్‌ని నిర్వహించారు.
శర్వానంద్‌ మాట్లాడుతూ, ‘ప్రభాస్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. మా ట్రైలర్‌ రిలీజ్‌కి ట్వీట్‌ వేశారు. అలాగే సినిమా రిలీజ్‌కు ముందు ఒక చిన్న యాడ్‌ చేసి సపోర్ట్‌ ఇచ్చారు. ఈ సినిమాకు ఫస్ట్‌ హీరో మా ప్రొడ్యూసర్‌ వంశీ. యూవీ క్రియేషన్స్‌లో ఇది నాకు నాలుగో హిట్‌. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌ ఇస్తానని చెప్పాను.. ఇచ్చాను. ఇప్పుడు సమ్మర్‌కు బంపర్‌ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చాం. ఈ విజయాన్ని నాకు అందించిన తెలుగు ప్రేక్షకులకు కతజ్ఞతలు. మా డైరెక్టర్‌ అభిలాష్‌ రెడ్డి చెప్పిన కథ నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేసింది. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఇది నా బెస్ట్‌ ఫిల్మ్‌ అని నేను గర్వంగా చెప్పుకుంటాను’ అని తెలిపారు.
‘ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడం, మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక ముఖ్య కారణం డైరెక్టర్‌ అభిలాష్‌ రెడ్డి. ఆయన ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆయన విజన్‌కు తగ్గట్టు ఖర్చు పెట్టిన నిర్మాత వంశీకి హ్యాట్సాఫ్‌’ అని హీరో రాజశేఖర్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -